గుంటూరు కారం (GunturKaaram)నుంచి ఏ అప్డేట్ విన్నా..మహేష్ స్వాగ్ను ఊహించుకున్న భలే అనిపిస్తోంది ఫ్యాన్స్కి. ఇంకొంతమందికైతే..చూడగానే మజా వస్తుంది..హార్ట్ బీట్ పెరుగుతుంది..ఈల వేయాలి అనిపిస్తుంది! అంతే హుషారుగా గుంటూరు కారంకి సంబందించిన ప్రతి విషయాన్నీతెలుసుకోండి.
ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం మార్నింగ్ షోస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 4:00 AM షోలు, ఒక వారం పాటు అనుమతి మంజూరు చేశారు. ఇక టికెట్ల రేట్స్ కూడా పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది.
గుంటూరు కారం సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్లు ఇలా ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్‌లు – 175(సాధారణ ధర) + ₹65(పెంపు), మల్టీప్లెక్స్‌లు – ₹295 (సాధారణ ధర) + ₹100(పెంపు)కు అనుమతి ఇచ్చారు.
ఇక బెన్ఫిట్ షోలు (1:00 AM) చూసుకుంటే..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 థియేటర్లలో పడనున్నాయి. అందులో హైదరాబాద్ థియేటర్లు ఎన్ని? ఏయే థియేటర్లలో అర్ధరాత్రి ఒంటి గంటకు సినిమా ప్రదరిస్తారో చూడండి.
గుంటూరు కారం బెన్ఫిట్ షోల థియేటర్స్ లిస్ట్!
నెక్సాస్ మాస్, కూకట్ పల్లి
ఏఎంబీ సినిమాస్, గచ్చిబౌలి
భ్రమరాంబ థియేటర్, కూకట్ పల్లి
మల్లిఖార్జున థియేటర్, కూకట్ పల్లి
అర్జున థియేటర్, కూకట్ పల్లి
విశ్వనాథ్ థియేటర్, కూకట్ పల్లి
గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ
సుదర్శన్ 35 ఎంఎం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్
రాజధాని డీలక్స్, దిల్ సుఖ్ నగర్
శ్రీరాములు థియేటర్, మూసాపేట్
శ్రీ సాయి రామ్ థియేటర్, మల్కాజ్ గిరి
శ్రీ ప్రేమ థియేటర్, తుక్కుగూడ
ప్రసాద్ మల్టీప్లెక్స్, నెక్లెస్ రోడ్
ఎస్విసీ తిరుమల థియేటర్, ఖమ్మం
వినోద థియేటర్, నల్గొండ
మమతా థియేటర్, కరీంనగర్
నటరాజ్ థియేటర్, నల్గొండ
ఎస్విసీ విజయ థియేటర్, నిజామాబాద్
వెంకటేశ్వర థియేటర్, మహబూబ్ నగర్
శ్రీనివాసా థియేటర్, మహబూబ్ నగర్
రాధిక థియేటర్, వరంగల్
అమృత థియేటర్, హన్మకొండ
ఎస్విసీ ముల్టీప్లెక్స్, గద్వాల్
గుంటూరు కారం సినిమాకు సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది.
‘U/A’ సర్టిఫికేట్: ఎవరైనా దీన్ని చూడవచ్చు..కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు రొమాంటిక్ టచ్ ఉంటోంది.
👉 – Please join our whatsapp channel here –