DailyDose

రద్దీగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

రద్దీగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం షామియానాలు, కుర్చీలు, తాగునీరు, మొబైల్ టాయిలెట్‌ల సదుపాయం కల్పించింది. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ వద్ద కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, బస్‌భవన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసింది. వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలించి దానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ‘ఎక్స్‌(ట్విటర్‌)’లో పోస్ట్‌ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z