DailyDose

సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు

సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు

ఏపీలో మున్సిపల్‌ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాగానే కార్మిక సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. రేపటి నుంచి మున్సిపల్‌ కార్మికులు విధుల్లోకి రానున్నారు.

మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని, కేసులు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి వెయ్యి రూపాయలు కొత్త బట్టల కొనుగోలుకి ఇస్తామన్నారు. చనిపోయిన కార్మికులు కుటుంబాలకు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే ఐదు నుంచి ఏడు లక్షలకు సాయం పెంచామని మంత్రి చెప్పారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే రెండు నెలల్లో ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. రేపు ఎప్పుడు జీతం పెరిగినా 21 వేల పైనే పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయన్నారు. రేపు సాయంత్రానికి మినిట్స్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

చర్చలు సానుకూలంగా జరిగాయని కార్మిక సంఘం నేత ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు. రేపట్నుంచి కార్మికులు విధుల్లోకి వస్తారని.. జీవోలు వచ్చాక సమ్మెను పూర్తిగా విరమిస్తామని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z