హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్(MMTS Trains) రైళ్లు రద్దు( Canceled) చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నాంపల్లి-మేడ్చల్ మార్గంలో సర్వీసులను అధికారులు రద్దు చేశారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్(,Charminar Express) పట్టాలు తప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. కాగా, నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్‌లో ఆగే క్రమంలో డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని రైల్వే అధికారులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. రైలు ఆగుతున్న సమయంలో పట్టాలు దిగినందున పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –