రాష్ట్రంలో యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.40వేల కోట్లు ఆర్జిస్తోందన్నారు. విద్యాసంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రామమందిర నిర్మాణం భాజపా కార్యక్రమం కాదని.. దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లో రూ.లక్షకోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?. కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్ విచారణ అంటున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ తీరు భారాస నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటోంది’’ అని బండి సంజయ్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –