Politics

ఎంతోమంది మహామహులు తెదేపాను వీడినా పార్టీకి ఏమీ కాలేదు!

ఎంతోమంది మహామహులు తెదేపాను వీడినా పార్టీకి ఏమీ కాలేదు!

ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఎన్ని అంటున్నా 1999 నుంచి తానే సర్దుకుపోతూ వచ్చానని ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) (Kesineni Chinni) తెలిపారు. తమ కుటుంబంలో అప్పటి నుంచి కలహాలు ఉన్నాయని.. వాటితో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)కు సంబంధమేంటని ప్రశ్నించారు. బుధవారం సీఎం జగన్‌ను కలిసిన అనంతరం కేశినేని నాని విమర్శలు చేసిన నేపథ్యంలో చిన్ని స్పందించారు.

‘‘నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరచి మాట్లాడటం తగదు. ఎంతోమంది మహామహులు తెదేపాను వీడినా పార్టీకి ఏమీ కాలేదు. వచ్చేవాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్లు పోతుంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z