DailyDose

ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు పెంపు

ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు పెంపు

వాహనదారులకు రవాణాశాఖ మరో ఛాన్స్‌ ఇచ్చింది. పెండింగ్‌ చలానాల చెల్లింపునకు గడువుతేదీని జనవరి 31 వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం డిసెంబరు 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించటంతో మంచి స్పందన వచ్చింది.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 1.29 కోట్ల చలానాలు చెల్లించారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం సమకూరింది. సాంకేతిక సమస్యతో చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని వాహనదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయితీ గుడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు. సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని, చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690 (వాట్సప్‌) నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్‌సైట్‌ ద్వారా ట్రాఫిక్‌ చలానాలు చెల్లించవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z