విజయవాడ: తక్షణమే మెగా డీఎస్సీ నిర్వహించాలని యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులు పిలుపునిచ్చిన ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని విజయవాడలోని బందర్ రోడ్డు రాఘవయ్య పార్కు నుంచి తాడేపల్లికి వెళ్లాలని తొలుత వీరు నిర్ణయించుకున్నారు. పోలీసులు ముందే అక్కడ మోహరించి ఉండటంతో.. బెంజిసర్కిల్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరి వెళ్లారు. నేతాజీ వంతెన వద్దకు చేరుకోగానే వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.
👉 – Please join our whatsapp channel here –