Agriculture

26.18 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు

26.18 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు

తెలంగాణలో యాసంగి సీజన్‌లో మొత్తం 54.93 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు 26.18 లక్షల ఎకరాల (47.67శాతం) మేరకు పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. యాసంగి సీజన్‌కు వరి సాధారణ విస్తీర్ణం 40.50 లక్షల ఎకరాలకుగాను ఇప్పటి వరకు 16.42 (40.56 శాతం) లక్షల ఎకరాల మేరకు సాగయినట్లు పేర్కొంది. ఈ సీజన్‌లో అత్యల్పంగా జయశంకర్‌ భూపాలపల్లిలో 5.19 శాతం మాత్రమే సాగవుతోంది. అక్కడ సీజన్‌లో 78280 ఎకరాలకు గాను ఇప్పటి వరకు కేవలం 3957 ఎకరాలు మాత్రమే పంటలు వేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో తక్కువగా.. మెదక్‌ 7.70 శాతం, ములుగు జిల్లాలో 8.75 శాతం పంటలు వేశారని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు నివేదిక ఇచ్చింది. వరితో పాటు మొక్కజొన్న 3.52 లక్షల ఎకరాలు, శనగ 2.44 లక్షలు, వేరుసెనగ 1.91 లక్షలు, జొన్న 70220 ఎకరాలు, మినుములు 28099, పొద్దుతిరుగుడు 11737, కుసుమలు 8751, గోధుములు 5094, పెసలు 3889, బొబ్బర్లు 2928 ఎకరాల మేరకు సాగవుతున్నట్లు పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z