మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్ర మలయాళ టీజర్ గురువారం విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్ (Bramayugam Teaser) సినిమాపై అంచనాలను పెంచేసింది. త్వరలోనే ‘భ్రమయుగం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
👉 – Please join our whatsapp channel here –