ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 14.70 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయి. ఈసారికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ లక్ష్యంలో 81 శాతం వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది.
క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైనదాంతో పోలిస్తే ఇది 19.41 శాతం అధికమని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.18.23 లక్షల కోట్ల పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. క్రితం ఏడాది వసూలైన రూ.16.61 లక్షల కోట్ల కంటే ఇది 9.75 శాతం అధికం. అలాగే ఏప్రిల్ 1, 2023 నుంచి జనవరి 10, 2024 వరకు రూ.2.48 లక్షల కోట్ల రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది.
👉 – Please join our whatsapp channel here –