అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ మళ్లీ దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే నియంత తరహాలో పాలించనున్నట్లు చెప్పారు. రెండు లక్ష్యాల కోసం తాను నియంతగా మారనున్నట్లు ఆయన వెల్లడించారు. తనపై అక్రమ కేసులు బనాయించి విచారణ చేపడితే అప్పుడు అమెరికా స్తంభించిపోతుందన్నారు. తనను నియంతగా చిత్రీకరిస్తూ.. విపక్షాలు ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నాయని ట్రంప్ అన్నారు.
తానేమీ యుద్ధాలు చేయలేదని, విదేశాల్లో ఉన్న దళాలను వెనక్కి రప్పించానని, కానీ అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం యుద్ధ కాంక్షనే రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ ఏడాది కూడా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు రిపబ్లికన్ నేత ట్రంప్ ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో ఆయన్ను దోషిగా తేల్చి దేశాధ్యక్ష పదవికి దూరంగా చేయాలని డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ట్రంప్‌కు రెండో సారి అధికారం ఇస్తే అమెరికా ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని ఇటీవల బైడెన్ పేర్కొన్నారు. అమెరికా-మెక్సికో బోర్డర్ మధ్య అక్రమ చొరబాట్లను నిలిపివేయడం, ఆ తర్వాత ఎనర్జీ ప్రాజెక్టులకు ఊతం ఇవ్వడమే తన లక్ష్యమని, ఆ రెండు లక్ష్యాల కోసం నియంతలా మారుతానని, ఆ రెండు పనులు పూర్తి అయిన తర్వాత తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్నట్లు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –