లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలతో దిల్లీలో ఏఐసీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి సమన్వయకర్తలుగా ఉన్న మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది. నల్గొండలో 3లక్షల మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపిస్తాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు’’ అని వివరించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని భావిస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయన్నారు.
👉 – Please join our whatsapp channel here –