మన్నవ మోహనకృష్ణ ఛారిటిబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని సామాన్య, మద్యతరగతి పేదలకు అవసరమైన గృహాపకరణాల్లో భాగంగా 1000 ప్రెజర్ కుక్కర్లను పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణా వీటిని అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా తమ ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు వెయ్యి ప్రెజర్ కుక్కర్లు అందిస్తునట్లు మోహనకృష్ణ తెలిపారు. పేదలపై, సామాన్య ప్రజలపై అధికంగా పన్నులు వేసి ప్రజల నుండి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చెత్తపై పన్ను, మరుగుదొడ్డిపై పన్నులు అంటూ ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని వాపోయారు. పట్టణాల్లోని మద్యతరగతి జీవులపై అధికంగా పన్ను భారాలు వేయడంతో వారిలోని కొనుగోలు శక్తి తగ్గిపోయిందన్నారు. పేదలు, రోజువారి కూలీల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందని, సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారని మన్నవ మోహనకృష్ణ ధ్వజమెత్తారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పేదలను సంపన్నులను చేయగలిగిన సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు. మహిళా అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్, మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీని స్థాపించింది ఎన్టీఆర్ అని మోహన కృష్ణ అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, చదుకుంటున్న ఇంట్లోని ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తారని తెలిపారు.
########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z