తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్లను పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారాస నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటి పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ప్రస్తుతం శాసనసభ్యుల బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మెజార్టీ ఉంది. రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుండటంతో అవి కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
👉 – Please join our whatsapp channel here –