DailyDose

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌, నర్సాపూర్‌, శ్రీకాకుళం మధ్య జనవరి 12, 13, 14 తేదీల్లో సర్వీసులందించనున్నాయి. ఈ రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సాధారణ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌. రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలివే..

హైదరాబాద్‌ – శ్రీకాకుళం రోడ్‌ ప్రత్యేక రైలు (07178) జనవరి 12న రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.45గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.

శ్రీకాకుళం రోడ్‌ – హైదరాబాద్‌ ప్రత్యేక రైలు (07179) జనవరి 13న శ్రీకాకుళంలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్‌కు రానుంది.

సికింద్రాబాద్‌ – నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (07176) జనవరి 13న రాత్రి 10.05గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10గంటలకు నర్సాపూర్‌ చేరుకోనుంది.

నర్సాపూర్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07177) జనవరి 14న సాయంత్రం 6గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.50గంటలకు హైదరాబాద్‌ చేరుకోనుంది.

సంక్రాంతి రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లలో తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఆ కోచ్‌ల వివరాలు ఇవే..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z