అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో ఉత్సవం నిర్వహిస్తున్నారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటల30నిముషాల నుండి ఊరేగింపుగా బయల్దేరి స్వస్తి వాచకం, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం అనంఅతరం శ్రీ రామ తారక మహా మంత్ర హోమం, పూర్ణాహుతి ఆలయ ట్రస్టీ గంగవరపు రజనీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ శేషు ఇంటూరి, అధ్యక్షుడు పుట్టగుంట మురళీకృష్ణలు ఓ ప్రకటనలో తెలిపారు. హోమం అనంతరం శ్రీరామ మంత్ర పారాయణ, భజనలు, మహాప్రసాద నివేదన అనంతరం అయోధ్య రామాలయ ప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z