* బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రౌడిషీటర్ పై కత్తులతో దాడిచేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ ను పై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా చంపారు. అతని మర్మంగాలు కట్ చేసిన దుండగులు వంటిపై అనేక సార్లు పొడిచి అతి దారుణంగ హత్య చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలాపూర్ ప్రాంతంలో ముబారఖ్ సిగార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సామాన్యుడిగా ఉన్న ముబారఖ్ అంచలంచెలుగా ఎదిరి రౌడీషీటర్ గా స్థిరపడ్డాడు. అయితే అతని పై ఎవరికి ఏం అన్యాయం జరిగిందో తెలియదు కానీ.. అతడిపై కక్ష పెంచుకున్న కొందరు దుండగులు తన ఒక్కడు చిక్కేందుకు సమయం వైట్ చేశారు. చివరకు ఆ సమయం రానేవచ్చింది. వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ముబారఖ్ ఒక్కరు చిక్కాడు. దీంతో దుండగులు ప్లాన్ ప్రకారం అతనిపై ఒక్కసారిగా దాడి చేశారు. విచకనా రహితంగా దాడి చేయడంతో ముబారఖ్ అక్కడికక్కడే కిందికి పడిపోయాడు. అంతే కాకుండా ముబారఖ్ పై కర్కసంగా వ్యవహరించారు. అతని మర్మాంగాని కోయడమే కాకుండా విచక్షణారహితంగా కత్తితో పోడిచారు. ముబారఖ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి హుటా హుటిన క్లూస్ టీ, డాగ్ స్క్వాడ్ తో అక్కడకు చేరుకున్నారు.ముబారఖ్ నిర్జీవ స్థితిలో వుండటంతో షాక్ తిన్నారు. క్రూరాతి క్రూరంగా కత్తులతో దాడిచేడంతోనే ముబారఖ్ మృతి చెందాడని, ఇది గతంలో రౌడీ షీటర్ అని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. హత్యకు గల కారణాలపై విచారణను బాలాపూర్ పోలీసులు ముమ్మరం చేసారు. ముబారఖ్ కు గతంలో ఎవరితో అయినా విరోధం ఉందా? వారే ఈ హత్య చేశారా? లేక కుటుంబంలోని వారే ముబారఖ్ హత్యకు కారకులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా విరోధం ఉంటే పోలీసుల వరకు తీసుకురావాలని కానీ.. ఇలా మృగాళ్లా మనిషిపై దాడులు చేయడం కరెక్ట్ కాదని పోలీసులు సూచించారు. ముబారఖ్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
* భర్త 50 రూపాయలు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న భార్య
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాడ్పడుతున్నారు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. దీంతో.. ఇంట్లో వాళ్లను మందలించాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా, చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఓ ఆత్మహత్య ఘటన విస్మయం కలిగిస్తోంది.. తన భర్త 50 రూపాయిలు ఖర్చులకు ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడింది భార్య.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పోన్నేపల్లిలో భర్త అనంతకుమార్‌తో కలిసి 27 ఏళ్ల రాధ అనే మహిళ నివాసం ఉండేది.. అయితే, ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు తనకు ఖర్చులకు రూ.50 ఇవ్వాలని భర్త అనంతకుమార్‌ను అడిగింది రాధ.. అయితే, డబ్బులు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు.. తనకు డబ్బులు ఇవ్వలేదని మనస్థాపంతో సెల్‌ఫోన్ క్లీనింగ్ చేసే ఆయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక ఎస్సై వివరించారు. సెల్‌ఫోన్ క్లీనింగ్ ఆయిల్ తాగిన రాధ తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్టు తెలిపారు. ఇక, రాధ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.. ఇప్పటికే పోస్టుమార్టం నిర్వఠహించి రాధ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పేర్కొన్నారు ఎస్ఐ.
* ఆర్మూర్ హైవేపై రోడ్డు ప్రమాదం
ఆర్మూర్ హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో 44 నంబర్ హైవేపై ఓ యువతి రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చేపూర్ గ్రామానికి చెందిన చంద్రకళగా గుర్తించారు.ఈమె ఆటో దిగి రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
* మాజీ ముఖ్యమంత్రికి తప్పిన ముప్పు
జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కారు ప్రమాదానికి గురైంది. ముఫ్తీ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముఫ్తీ కారు ముందు భాగం స్వల్పంగా డ్యామేజ్ కాగా, సురక్షితంగా ముఫ్తీ బయటపడ్డారు. ఆమె భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంత్ నాగ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖానాబాల్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఆమె మరో కారులో పరామర్శకు వెళ్లారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* కర్ణాటకలో దారుణం
కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లాడ్జి గదిలోకి అక్రమంగా చొరబడిన కొందరు దుండగులు ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ఇద్దరినీ కొడుతూ వీడియో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి ఏడున హవేరీ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వైరల్ అవుతున్న వీడియోలో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. ఈ ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవాళ్లుగా తెలుస్తోంది. హనగల్ తాలుకాలోని లాడ్జిలో ఈ జంట బస చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మైనారిటి వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తుల గుంపు హోటల్‌లోకి ప్రవేశించారు. లాడ్ట్‌లోని గది నంబర్ వద్దకు వెళ్లి తలుపు తట్టారు. ఓ వ్యక్తి డోర్ తీయడంతో వెంటనే రూమ్‌లోని ప్రవేశించి నేరుగా యువతి వద్దకు పరుగెత్తారు. దీంతో మహిళ భయపడి తన ముఖాన్ని బుర్ఖాతో కప్పుకునే ప్రయత్నం చేసింది.అయినా అంగతకులు యువతిపై దాడికి దిగారు. గట్టిగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆమెతో ఉన్న వ్యక్తిపై కూడా దాడి చేసేందుకు రాగా అతడు బయటకు పరుగెత్తడానికి ప్రయత్నించాడు. ఇద్దరు ముగ్గురు దుండగులు అతడ్ని లోపలికి ఈడ్చుకొచ్చి కొట్టారు. యువతిపై సైతం పదే పదే దాడికి పాల్పడ్డారు. లాడ్జి బయట తీసిన మరో వీడియోలో యువతి బుర్ఖాతో ముఖాన్ని కప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. వ్యక్తులు ఆమె హిజాబ్‌ను తొలగించి వీడియో తీశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.అంగతకుల దాడిలో గాయాలపాలైన జంట హనగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆరుగురిలో ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారుగా గుర్తించారు. మిగిలిన నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడికి పాల్పడింది ఎవరూ? ఎందుకు కొట్టారనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే యువతి యువకుల మతాలు వేరుకావడం కారణంగానే దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది.