సుదీర్ఘ కసరత్తు తర్వాత వైకాపా మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జిలను మార్పు చేసింది. ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు మూడో జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి విడుదల చేసింది. రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్ఛార్జిలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కొత్తగా నియమితులైన పార్లమెంట్ ఇన్ఛార్జిలు వీరే..
విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
విజయవాడ – కేశినేని నాని
కర్నూలు – గుమ్మనూరు జయరాం
ఏలూరు – కారుమూరు సునీల్ కుమార్
తిరుపతి – కోనేటి ఆదిమూలం
శ్రీకాకుళం – పేరాడ తిలక్
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు వీరే..
ఇచ్ఛాపురం – పిరియ విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్సీ) – కంభం విజయరాజు
రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి
దర్శి – బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు – విజయానందరెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి
ఆలూరు – బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్టీ) – డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ) – మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేష్
పెడన – ఉప్పాల రాము
👉 – Please join our whatsapp channel here –