అమెరికాను శీతాకాల పెను తుపాను భయపెడుతోంది. శుక్రవారం ఉదయానికే తుపాను షికాగో నగరంలోకి ప్రవేశించింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో అర అడుగు మేర మంచు పేరుకుపోయింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మంచు తుపాను విరుచుకుపడే అవకాశం ఉండగా.. దక్షిణాన సుడిగాలులు(టోర్నడోలు) విజృంభిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వారం ప్రారంభంలో పెను తుపాను వల్ల అమెరికా తూర్పు భాగంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి లక్షల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ చేదు అనుభవాన్ని మరచిపోకముందే మరో తుపాను భయాందోళనకు గురి చేస్తోంది.
👉 – Please join our whatsapp channel here –