పాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని.. అందుకు తనదే బాధ్యత అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీని నడపడం సరికాదన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
‘‘ఎన్నికల్లో ప్రజలు తప్పుచేశారని అనడం సరైంది కాదు. భారాస నేతలు ఇకపై అలా మాట్లాడొద్దు. రెండు సార్లు మనల్ని గెలిపించింది కూడా ఈ ప్రజలేనని గుర్తు పెట్టుకోవాలి. పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు. 14 చోట్ల అతి తక్కువ తేడాలో మన అభ్యర్థులు ఓడిపోయారు. పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదు. దళితబంధు కొందరికే రావడంతో మిగతావారు వ్యతిరేకమయ్యారు. ఈ పథకంపై ఇతర కులాల్లోనూ వ్యతిరేకత కనిపించింది. భూస్వాములకు రైతుబంధు ఇవ్వడాన్ని చిన్న రైతులు వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భారాస మాత్రమే’’ అని కేటీఆర్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –