సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రభాస్ (Prabhas) అభిమానులకు వైజయంతి మూవీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ‘కల్కి 2998 ఏడీ’ (Kalki 2898 AD) రిలీజ్ డేట్ ప్రకటించింది. వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘‘6000 సంవత్సరాల క్రితం ముగిసిన కథ.. 2024 మే 9 నుంచి ప్రారంభం కానుంది’’ అని ట్వీట్ చేసింది. ప్రభాస్ కొత్త పోస్టర్ షేర్ చేసింది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోనే ‘కల్కి 2898 ఏడీ’ రూపుదిద్దుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా సెట్స్‌తో పాటు ఆయుధాలు, ఇతర వస్తువులు సరికొత్తగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ భారతీయ సినిమా పరిశ్రమ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –