DailyDose

ఎన్‌‌సీసీ స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్

ఎన్‌‌సీసీ స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 56వ కోర్సు అడ్మిషన్స్​కు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఫిబ్రవరి 6వ తేదీలోగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు.

అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్​ ఇయర్​ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు అకడమిక్‌‌‌‌‌‌‌‌ సంవత్సరాలు ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ సీనియర్‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ సి సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌లో కనీసం బి గ్రేడ్‌‌‌‌‌‌‌‌ పొంది ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ షార్ట్‌‌‌‌‌‌‌‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ట్రైనింగ్​: ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ అకాడెమీ చెన్నైలో 49 వారాలు ట్రైనింగ్​ ఇస్తారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైఫండ్‌‌‌‌‌‌‌‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ స్ట్రాటజిక్‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌ డిగ్రీని మద్రాస్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌‌‌‌‌‌‌‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

దరఖాస్తులు : ఆన్​లైన్​లో ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z