NRI-NRT

మిషిగన్‌లో St.Martinus విద్యార్థులతో సమావేశం

మిషిగన్‌లో St.Martinus విద్యార్థులతో సమావేశం

అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం పాంటియక్ నగరంలోని పాంటియాక్ జనరల్ హాస్పిటల్‌లో… ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కరేబీయన్ దీవుల్లోని కురసావులో నిర్వహించబడుతున్న St.Martinus (SMU) విశ్వవిద్యాలయ వైద్య విద్యార్థులతో…శుక్రవారం నాడు సమావేశాన్ని నిర్వహించారు. రోటేషన్ పద్ధతిలో పాంటియాక్ ఆసుపత్రిలో పనిచేస్తున్న SMU విద్యార్థులతో పాటు స్థానిక రెసిడెంట్ వైద్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా SMU CEO సజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికాకు మాత్రమే పరిమితమైన అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు అమెరికా వెలుపల రెండు వైద్య విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఉందని, ఇందులో ఒకటి SMUకు రావడం పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. ఈ గుర్తింపు లభించడం పట్ల డీన్ డా. గింజుపల్లి మురళీని ఆయన అభినందించారు. కురసావులోని తమ యూనివర్శిటీ కోసం నూతన భవనాలను కొనుగోలు చేశామని, 200మందికి పైగా విద్యార్థులు వసతి, భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పాంటియాక్ జనరల్ ఆసుపత్రి ఉపాధ్యక్షురాలు, SMU పూర్వ నిర్వాహకురాలు ప్రియం శర్మ మాట్లాడుతూ SMUకు గుర్తింపు రావడం పట్ల ఆనందం వెలిబుచ్చారు. సంస్థ మరింత మంది నాణ్యమైన వైద్యులను సమాజానికి అందించాలని ఆకాంక్షించారు. SMU బోర్డు సభ్యుడు నిరంజన్ శృంగవరపు ప్రసంగిస్తూ గుర్తింపు రావడానికి కృషి చేసిన వారిని అభినందించారు. విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్, విద్యాపరమైన అవసరాలు ఉంటే వెంటనే తనను సంప్రదించాలని కోరారు. బోర్డు సభ్యులు ప్రకాష్ గేరా, పుట్టగుంట సురేష్‌లు పాల్గొన్నారు. అనంతరం పాంటియాక్ ఆసుపత్రిలోని SMU కార్యాలయాన్ని సహాయ డీన్ డా. పోరేటి శ్రీరాంతో కలిసి సందర్శించారు.


###########

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z

TANA 2023 Elections Yarlagadda Venkataramana
TANA 2023 Elections Ashok Babu Kolla
TANA 2023 Elections Ravi Kiran Muvva
TANA 2023 Elections Raja Surapaneni
TANA 2023 Elections Sunil Pantra
TANA 2023 Elections Sirisha Tunuguntla
TANA 2023 Elections Tagore Mallineni