తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ శుక్రవారం నాడు ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఇష్టంతో చదివితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు తానా తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, ఇతర సామాగ్రి అందజేశారు. రోటరీ నగర్ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థులకు, పాండురంగాపురం ఉన్నత పాఠశాలలో 76 మందికి, వెలుగుమట్ల ఉన్నత పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మధు, స్వర్ణలత, రవికిషోర్, వెంకటరమణకి ధన్యవాదాలు తెలిపారు. గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z