DailyDose

ప్రజాభవన్ వెలుపల ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం

ప్రజాభవన్ వెలుపల ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం

ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఉన్నతాధికారులు స్వయంగా దరఖాస్తులను స్వీకరించి భరోసా కల్పిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు మెస్ బిల్లులు, జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. పెంచిన రూ.3వేల జీతాన్ని వెంటనే ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. ప్రజాభవన్ వెలుపల ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z