తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించిన విషయం తెలిసిందే. వారి రాజీనామాలు ఆమోదం పొందిన నేపథ్యంలో ఛైర్మన్, సభ్యుల నియామకానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
👉 – Please join our whatsapp channel here –