ఎన్నారై తెదేపా నేత, తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో శుక్రవారం నాడు భేటీ అయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా విజయానికి ప్రవాసులు కృషి చేయాలని, ప్రభుత్వ ఏర్పాటుకు వారి అవసరం గురించి చర్చించారు. తెదేపా ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ఎన్నారైలు తమ వంతు పాత్ర చిత్తశుద్ధితో పోషిస్తామని సతీష్ చంద్రబాబుకు వెల్లడించారు. ఏపీలో తాను కూడా ప్రచారం చేస్తానని సతీష్ పేర్కొన్నారు. ఎన్నారై తెదేపా శ్రేణులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z