అమెరికాలో శీతాకాలపు తుఫాను అలజడి సృష్టించింది. మిడ్‌వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో ఈ తుఫాను కారణంగా శుక్రవారం రెండు వేలకు పైగా విమానాలు రద్దవ్వగా, 5,604 సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. పలు విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు. వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. గత ఏడాది జూలై తర్వాత ఇంత భారీ స్థాయిలో విమానాలు రద్దు కావడం ఇదే ప్రథమం.
తుఫాను వల్ల గ్రేట్ లేక్స్, దక్షిణ ప్రాంతంలో సుమారు 2.5 లక్షల కుటుంబాలు అంధకారంలో చిక్కున్నాయి. అమెరికా తూర్పు ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్య పశ్చిమ ప్రాంతంలో మంచు తుఫాను ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చలిగాలుల తీవ్రత కారణంగా 1.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –