Politics

ఏపీ ఉప ముఖ్యమంత్రి పై కేసు నమోదు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్‌ బేగంబజార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీపై నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేశారు. దీనిపై బేగంబజార్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నారాయణ స్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా ఆయన మాట్లాడినట్టు నిర్ధరించారు. 504, 505(2), r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బేగంబజార్ సీఐ శంకర్ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z