ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ రిలయన్స్ వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం,ఎంపిక పక్రియ వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
విద్యార్హతలు..
ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 2024లో బీటెక్/బీఈ పూర్తి చేసే విద్యార్థుల నుంచి రిలయన్స్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి స్ట్రీమ్‌లలో ఈ నియామకాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో కనీసం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి..
ఎంపిక ప్రక్రియ..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఇక అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..
జీతం..
ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.7.50 లక్షలు, ఏడాది తర్వాత ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.8.00 లక్షలు ఉంటుంది. అలాగే వార్షిక బోనస్ కింద సంవత్సరానికి రూ.88 వేలు ఇస్తారు. ఉద్యోగం పర్మినెంట్ అయిన తరువాత సంస్థ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలు ఉంటాయి.. రెండేళ్లకు ఒకసారి హైక్ ఉంటుందట.. అలాగే నాన్ ఐఐటీ వాళ్లకు ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.9.00 లక్షలు, సంవత్సరం పూర్తయిన తర్వాత ఫిక్స్‌డ్ పే కింద రూ.9.50 లక్షలు ఉంటుంది. వార్షిక బోనస్ కింద సంవత్సరానికి సంవత్సరానికి రూ.1.05 లక్షలు ఇస్తారు..
ముఖ్యమైన తేదీలు..
రిజిస్ట్రేషన్ : 11-01-2024 నుంచి 19-01-2024 వరకు.
ఆన్‌లైన్ అసెస్‌మెంట్ : 05-02-2024 నుంచి 08-02-2024 వరకు.
ఇంటర్వ్యూ : 23-02-2024 నుంచి 01-03-2024 వరకు.
తుది ఎంపిక: మార్చి, 2024 చివరి నాటికి పూర్తవుతాయి.
ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ https://relianceget2024.in/ పరిశీలించగలరు…
👉 – Please join our whatsapp channel here –