భారత యువ షూటర్ విజయ్‌వీర్ సిద్దూ(Vijayveer Sidhu) ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నాడు. జకర్తాలో జరుగుతున్న ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో మెరిసిన విజయ్‌వీర్.. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్(25m RFP) విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics)కు అర్హత సాధించాడు. తద్వారా ఇండియా నుంచి విశ్వక్రీడల్లో బరిలోకి దిగనున్న 17 వ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పటివరకూ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ విభాగంలో అనీశ్ భన్వాలా(Anish Bhanwala), విజయ్‌వీర్ మాత్రమే బెర్తు సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో విజయ్‌వీర్ 577 పాయింట్లు కొల్లగొట్టాడు.
దాంతో, మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదే పోటీలో ఆదర్శ్ సింగ్(Adarsh Singh), గురుప్రీత్ సింగ్(Gurupreet Singh)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆదర్శ్ 565 పాయింట్లతో 29వ, గురుప్రీత్ 562 పాయింట్లతో 30 స్థానంతో సరిపెట్టుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –