రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్లను రోడ్డుపై వదిలేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం వీరికోసం ఆలోచన చేసి నెలకు రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవడం సరి కాదన్నారు. అలాగే మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు పెంచాలని కోరారు.
👉 – Please join our whatsapp channel here –