2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి ప్రవాసాంధ్రుడు కృషి చేయాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా నిలబెట్టే వరకు విశ్రమించకూడదని ఎన్నారై తెదేపా పిలుపినిచ్చింది. శుక్రవారం నాడు CBN Forum – Vision 20247 ఎన్నారై తెదేపాలు కలిసి ప్లేనోలో “మన రాష్త్రం – మన భవిష్యత్తు” పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో కోమటి జయరాం పాల్గొని ప్రసంగించారు. పోరుకి ప్రవాసులు, తెదేపా కార్యకర్తలు కలిసికట్టుగా సాగాలని, ఈ దఫా ఎన్నికలు ఏపీకి చావుబతుకుల యుద్ధమన్నారు. CBN Forum కమిటీ నుండి సహ-వ్యవస్థాపకుడు కిరణ్, యుకె నుండి అనుమోలు చోనితలు పాల్గొని విజన్ 2047 గురించి ప్రసంగించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసించారు.
ఇటీవల తెదేపాలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు కంభంపాటి బష్వంత్, ద్రోణవల్లి దుర్గలు కూడా ఈ కార్యక్రమంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కేసీ చేకూరి, చలసాని కిషోర్, దిలీప్ కుమార్ చండ్ర, పోలవరపు శ్రీకాంత్, సుగన్ చాగర్లమూడి, లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
###########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z