ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే కనీసం రెండున్నరేళ్లయినా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. జన సైనికులు కూడా ఇదే భావిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్‌కు తాను చెప్పినట్లు తెలిపారు.
ఈ మేరకు శనివారం హరిరామజోగయ్య ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 40 నుంచి 60 సీట్లు కోరాలని పవన్‌కు సూచించానని తెలిపారు.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం 40 సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తనతో చెప్పారని జోగయ్య పేర్కొన్నారు. ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపైనా పవన్‌తో చర్చించానని తెలిపారు. గతంలోనూ హరిరామ జోగయ్య ఇదే విధంగా బహిరంగ లేఖ విడుదల చేయడం గమనార్హం.
👉 – Please join our whatsapp channel here –