సలార్‌తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కీ 2898 AD’ సినిమా చేస్తున్న డార్లింగ్ మరోవైపు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ పార్ట్ 2’ ను లైన్‌లో పెట్టాడు. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా ప్రభాస్ చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ రాజా డీలక్స్. ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఒక సాలిడ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు మారుతి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అప్‌డేట్ ఏంటా అని రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. ఈ అప్‌డేట్‌కు సంబంధించి మేకర్స్ క్రేజీ న్యూస్ ఇచ్చారు.
సంక్రాంతి కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. సంక్రాంతి రోజున ఉదయించే సూర్యుడితో పాటు, రెబల్ స్టార్ మీ అందరికీ డబుల్ ట్రీట్ ఇవ్వడానికి వింటేజ్ డార్లింగ్ వస్తున్నాడు. జనవరి 15వ తేదీన ఉదయం 7:08 గంటలకు టైటిల్ & ఫస్ట్ లుక్‌ని ప్రకటించబోతున్నాం అంటూ రానుకోచ్చారు.
👉 – Please join our whatsapp channel here –