అంగన్‌వాడీలు తెగే వరకు లాగొద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అంగన్‌వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు ఇబ్బంది కలుగకూడదనే ఎస్మా పరిధిలోకి తెచ్చామన్నారు. ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉందని.. తెగేవరకు లాగకుండా అంగన్‌వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మళ్లీ కోరుతున్నామన్నారు. జులైలో జీతాలు పెంచుతామని ఆయన వివరించారు. అంగన్‌వాడీలకు ఎన్నికల తర్వాత జీతాలు పెంచుతామన్నారు.
జీతాలు ఐదు సంవత్సరాలు వరకు పెంచకూడదన్న నియమం ఏర్పరచుకున్నామని తెలిపారు. పట్టుదలకి పోకుండా విరమించాలని సూచించారు. అయితే, అంగన్‌వాడీల ఉద్యమం కొనసాగుతుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బారావమ్మ, బేబీ రాణి, ఎన్‌సీహెచ్ సుప్రజ స్పష్టం చేశారు.
👉 – Please join our whatsapp channel here –