జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించారు. జూన్ నాటికి కొత్తగా 50 వేలు, డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నీటిపారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారని.. అయినా అందుకు తగిన ప్రతిఫలం రాలేదన్నారు. అందుకే అవసరం మేరకు ఖర్చులు చేయాలన్నారు. కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్లు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –