భారతీయ వంటకాల్లో మెంతుల స్థానం కీలకం. చేదుగానే ఉన్నా, ఓ నాలుగు మెంతులు జోడిస్తే ఏ ఆహారమైనా రుచి అదిరిపోవాల్సిందే. ఇక మెంతికూర గురించి చెప్పేదేముంది? చపాతీ నుంచి పప్పు వరకు.. మెంతికూరను చేరిస్తే రుచితోపాటు, ఆరోగ్యానికి కూడా ఢోకా ఉండదు. మెంతికి సంబంధించి కొన్ని విషయాలు..
* ఒంట్లోని చెడు కొవ్వును కరిగించే లక్షణం మెంతులకు ఉందని చెబుతారు. ఊబకాయాన్ని తగ్గించుకోవాలని అనుకునేవారు, ఆహారంలో మెంతులు లేదా మెంతికూర చేర్చుకోవచ్చు.
* జీర్ణ సంబంధమైన సమస్యలకు మెంతులు దివ్యౌషధం. జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా ఆహారంలోని పోషకాలు కూడా ఒంటికి అందుతాయి.
* రుతుక్రమంలో మహిళలకు వచ్చే కండరాల నొప్పులను తగ్గించడంలో మెంతులు సాయపడతాయి. ఐరన్ లోపాన్ని సరిదిద్దేందుకు కూడా ఉపయోగపడతాయి.
* మెంతులకు ఆకలిని తగ్గించే గుణం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినేవారు నోరు కట్టేసుకోడానికి సాయపడుతాయి.
* నీళ్లలో నానబెట్టిన మెంతులతో మధుమేహం అదుపులో ఉంటుందనే విషయం ప్రచారంలో ఉంది. దీనికి శాస్త్రీయ రుజువులూ ఉన్నాయి.
* మెంతులు లేదా మెంతికూరలో పొటాషియం లాంటి పోషకాలు, విటమిన్స్, ప్రొటీన్స్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, తప్పనిసరిగా వంటకాల్లో చేర్చుకోవాలి.
👉 – Please join our whatsapp channel here –