Politics

ఇలాంటి నేతలున్న చోట పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ధైర్యం చేస్తారు?

ఇలాంటి నేతలున్న చోట పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ధైర్యం చేస్తారు?

ష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడం అంత ఈజీ కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుత్తేదారు మెడపై కత్తిపెట్టి బెదిరించినంత సులువు కాదన్నారు. ‘‘గతేడాది గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ సందర్భంగా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని జగన్‌ గొప్పలు చెప్పారు. రూ.13.12 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ ప్రకటించారు. మంత్రిగారు చెప్పి ఏడాది అవుతున్నా.. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.

జె ట్యాక్స్‌ బాధపడలేక జాకీ, లులు సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. జాకీ పరిశ్రమను అనంతపురం నుంచి ఎమ్మెల్యే తోపుదుర్తి తరిమేశారు. గుత్తేదారు వద్ద పనిచేసే 11 మందిని నిర్బంధించారు. ఈ విషయం తెలిసి మిగతా పారిశ్రామికవేత్తలు కూడా ముఖం చాటేశారు. కూలీల నిర్బంధంపై కలెక్టర్‌, ఎస్పీకి పశ్చిమ బెంగాల్‌ ఎంపీ లేఖ రాశారు. ఇలాంటి నేతలున్న చోట పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ధైర్యం చేస్తారు? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z