ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1.52 కోట్ల కార్డులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధిక కార్డులున్న రాష్ట్రాల్లో ఏపీ 9వ స్థానంలో నిలిచినట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ నెల 12 నాటికి దేశ వ్యాప్తంగా 30కోట్ల కార్డులు నమోదవగా.. 4.8కోట్ల కార్డులతో ఉత్తర్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ఆసుపత్రి అడ్మిషన్లలో తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు వరుస స్థానాల్లో నిలిచాయి. ఏపీలో ఇప్పటివరకు 49.67 లక్షల ఆసుపత్రి అడ్మిషన్లు జరిగాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అత్యధికంగా 64.05 లక్షల మందికి డయాలసిస్ చికిత్సలు జరిగాయి. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజి ఇస్తోంది.
👉 – Please join our whatsapp channel here –