అమెరికాలోని చికాగో ఆంధ్ర సంఘం(CAA) ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. నేపర్విల్లోని “మాల్ ఆఫ్ ఇండియా”లో ఈ వేడుకలు అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, ఉపాధ్యక్షులు కృష్ణ మతుకుమల్లిల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రవాసులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
ముగ్గుల పోటీలను పెద్దలు, తలీపిల్లలు, చిన్నారులు 3 విభాగాలుగా నిర్వహించారు. డా. భార్గవి నెట్టం, సౌమ్య బొజ్జ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ప్రవాసులు తమ కళానైపుణ్యాన్ని రంగవల్లుల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు. గోల్డెన్ రూల్ ఫ్యామిలీ ప్రాక్టిస్ సంస్థ, స్టెమ్ శాల సంస్థలు ముగ్గుల పోటీలలో పాల్గొన్న చిన్నారులందరికీ బహుమతులు అందజేశారు. భోగి పండుగను పురస్కరించుకుని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణములో చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. గొబ్బిళ్ళ వద్ద కోలాటం ఆడటంతో ఈ వేడుకలో సంపూర్ణ సంక్రాంతి శోభ నెలకొంది.
నరేష్ చింతమాని, సుజాత అప్పలనేని, శ్రీ స్మిత నండూరి, శైలజ సప్ప, సవిత మునగ, మాలతీ దామరాజు, శృతి కూచంపూడి, అన్విత పంచాగ్నుల, తమిశ్ర కొంచాడ, మంజరి మోటమర్రి, శృతి వర్మ, ప్రవీణ అంజుర్, బోస్ కొత్తపల్లి, గీతిక మండల తదితరులు వేడుకల విజయవంతానికి కృషి చేశారు. దినకర్ కరుమూరి,ఉమ కటికి, గౌరీ శంకర్ అద్దంకి, గిరి రావు కొత్తమాసు, పద్మారావు అప్పలనేని, నరసింహారావు వీరపనేని, మురళీ రెడ్డివారి, ప్రభాకర్ మల్లంపల్లి, హేమంత్ తలపనేని, కావ్య శ్రీ చల్ల తదితరులు పాల్గొన్నారు.
########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z