ఆన్‌లైన్ వేదికగా పార్ట్‌టైమ్ జాబ్, ఇన్వెస్ట్‌మెంట్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీకి చెందిన ప్రధాన నిందితుడు పంచాల్ సూచనలతో హర్యానా ఫరీదాబాద్‌కు చెందిన హిమాన్ష్, ప్రవీణ్ నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. పాన్ కార్డుల ద్వారా ఫేక్ కరెంటు ఖాతాలు తెరిచి దాదాపు రూ.2.5 కోట్లు సొమ్ము చేసుకున్నారు. అమీర్‌పేటకు చెందిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి చరవాణులు, సిమ్‌కార్డులు, చెక్‌బుక్‌లు సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడికి నకిలీ లింక్‌లు పంపించి దాదాపు రూ.4.75 లక్షలు నిందితులు వారి ఖాతాలో జమ చేయించుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్ పేరిట వచ్చే నకిలీ సందేశాలను నమ్మవద్దని, ధ్రవీకరణ లేని వెబ్‌సైట్స్ చూసి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –