మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ధార్మిక నగరమైన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుండే వివిధ గంగా ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు.
మకర సంక్రాంతి వేళ గంగాస్నానానికి ఎంతో విశిష్టత ఉంది. మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితోపాటు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంలోకి మారతాడు. అందుకే మకర సంక్రాంతి నాడు స్నానం చేయడం విశేషమైనదిగా భావిస్తారు. పురాణాలలో పేర్కొన్న వివరాల ప్రకారం ఉత్తరాయణ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాయణ పర్వదినాన మరణించిన వారికి మరుజన్మ ఉండదని చెబుతారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినంతనే ఉత్తరాయణ పర్వదినం ప్రారంభమవుతుంది.
సంక్రాంతి పండుగ దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు పేర్లతో జరుపుకుంటారు. కొన్నిచోట్ల మకర సంక్రాంతిగా, కొన్నిచోట్ల పొంగల్‌గా, మరికొన్ని చోట్ల ఉత్తరాయణ పండుగగా జరుపుకుంటారు. ఉత్తరాయణంలో పూర్వీకులకు పిండప్రదానం చేస్తే, వారు సంతృప్తి చెందుతారని పండితులు చెబుతారు.
👉 – Please join our whatsapp channel here –