Movies

ఆ తర్వాతే వాటి ఫలితాలు గురించి ఆలోచిస్తా!

ఆ తర్వాతే వాటి ఫలితాలు గురించి ఆలోచిస్తా!

చేసిన సినిమాల్ని గుర్తు చేసుకున్నప్పుడు నటులకి మొదట వాటి విజయాలో, లేదంటే వాటితో ఎదురైన పరాజయాలో మదిలో మెదులుతాయి. నాకు మాత్రం వాటితో ముడిపడిన జ్ఞాపకాలే గుర్తొస్తాయని చెబుతోంది రష్మిక. ‘యానిమల్‌’తో విజయోత్సాహంలో ఉన్న ఆమె ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా గడుపుతోంది. ‘యానిమల్‌’ తర్వాత రష్మికకి మరింత మంది అభిమానులు ఏర్పడ్డారు. సామాజిక మాధ్యమాలో పంచుకునే విషయాలు ఆమె అభిరుచులకి అద్దం పడుతూ ఉంటాయి. ప్రయాణాల గురించి, జ్ఞాపకాల గురించి రష్మిక తన మనసులో మాటని ఇలా బయటపెట్టారు. ‘‘మొదట్నుంచీ ప్రయాణాలంటే ఇష్టం. పనిలో భాగంగా చేసే ప్రయాణం అంటే ఇంకా ఇష్టం. ప్రతీ ప్రయాణం ఎన్నో జ్ఞాపకాల్ని పంచుతుంది. అవి జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. పనిచేసే చోట కూడా ఆ సినిమా ప్రయాణాన్ని ఎంత అందంగా కొనసాగించాం, ఎన్ని జ్ఞాపకాల్ని మూటగట్టుకున్నాం అనేదే నాకు ముఖ్యం. ఆ తర్వాతే వాటి ఫలితాలు గురించి ఆలోచిస్తా’’ అని చెప్పింది రష్మిక.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z