కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలని ఆశించిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంటతో ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–9, 18–21, 17–21తో ఓడిపోయింది.
58 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ 10–3తో ఏకంగా 7 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. కానీ ఒత్తిడికిలోనై, అనవసర తప్పిదాలు చేసి భారత జంట చైనా జోడీకి పుంజుకునే అవకాశం ఇచి్చంది. రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్‌లకు 45,500 డాలర్ల (రూ. 37 లక్షల 71 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
👉 – Please join our whatsapp channel here –