DailyDose

ఎంసెట్‌ పేరు మారనున్నదా?

ఎంసెట్‌ పేరు మారనున్నదా?

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాల కోసం ఎంసెట్‌ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశపరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్‌ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్‌, ఇతర వైద్యకోర్సులను నీట్‌ ద్వారా భర్తీ చేస్తోంది. అయినప్పటికీ ఎంసెట్‌ పేరులో మెడికల్‌ అనే పదం అలాగే కొనసాగుతోంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్‌ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్‌లో ఎం అక్షరాన్ని తొలగించి, టీఎస్‌ఈఏపీ సెట్‌ లేదా టీఎస్‌ఈఏ సెట్‌ అని మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇక్కడ పీ అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్‌ ద్వారానే భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని పొందుపరిచినట్లు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z