Movies

కీర్తి సురేశ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్

కీర్తి సురేశ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్

జాతీయ భాష హిందీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. మాతృభాష (తమిళభాష)పై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాలి అనే ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన విధించడం కూడా ముఖ్య కారణం. ఇక ఇదే అంశాన్ని సినిమాగా తీసినట్లు కనిపిస్తోంది. అదే ‘రఘుతాత’.

‘సలార్’, ‘కేజీఎఫ్’ సినిమాలని నిర్మించిన హోంబలే ఫిల్మ్.. కీర్తి సురేశ్‌ని ప్రధాన పాత్రలో పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా తీసిన ఈ చిత్రం.. వివాదాల్లేకుండా రిలీజైపోతుందా? లేదా? అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z