తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కెనడాలోని టోరొంటోలో జరిగిన ఈ వేడుకల్లో 600 మందికి పైగా ప్రవాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తాకా అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఈ వేడుకలను ప్రారంభించారు. జనరల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి సభికులను ఆహ్వానించారు. ధనలక్ష్మి మునుకుంట్ల, విశారద పదిర, స్వప్న తిరందాసు, అనిత సజ్జ, శృతి ఏలూరి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
సంక్రాంతి వేడుకల్లో భాగంగా పిల్లలందరికీ భోగిపండ్లు పోసి పురోహితులు మంజునాథ్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తూర్పు కాలమానం ప్రకారం తెలుగు తిథులు, నక్షత్రాలతో తయారుచేసిన తాకా 2024 క్యాలెండర్‌ను రమేశ్ మునుకుంట్ల, ఫౌండేషన్ కమిటీ ఛైర్మన్ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీ బోర్డు ఛైర్మన్ సురేశ్ కూన విడుదల చేసి సభికులకు అందజేశారు. రమేశ్ మాట్లాడుతూ తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంసృతి సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందజేయడానికి తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారందరూ పాల్గొనాలని కోరారు. అనంతరం ఒంటారియో రాష్ట్ర మాజీ మంత్రి దీపిక దామెర్ల, ముఖ్య ఫౌండర్ హనుమంతాచారి సామంతపుడి, ప్రసన్నకుమార్, అరుణ్ కుమార్ లాయం, సురేశ్ కూన, ఎక్స్‌అఫిషియో సభ్యులు కల్పన సభికులనుద్దేశించి ప్రసంగించారు. తాకాకు 2021-23 మధ్య కమిటీ సభ్యులుగా వ్యవహరించిన వారిని మెమోంటోలతో సత్కరించారు. డ్రాయింగ్ కాంపిటీషన్‌లో గెలిచిన పిల్లలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ వేడుకలకు అనిత సజ్జ, కుమారి విద్య భవణం, లిఖిత యార్లగడ్డ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
👉 – Please join our whatsapp channel here –