తెలంగాణలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాని ప్రభావం అత్యధికంగా ఉంది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
దిల్లీలోనూ..
దేశ రాజధాని దిల్లీని పొగమంచు కమ్మేసింది. దీంతో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. విమాన సర్వీసులకు సైతం అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. సర్వీసులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –